గోంగూరను చూడని వాళ్ళు ఉండరు. అలాగే వినని వాళ్లు కూడా ఉండరు. ఈ ఆకు కూర పల్లెల్లో బాగా దొరుకుతుంది. తోటల్లోనూ, ఇంటి పెరట్లో ను గోంగూరను పెంచుతుంటారు. గోంగూరతో పప్పు, చెట్ని వంటివాటిని చేసుకొని తినవచ్చు.గోంగూర రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.గోంగూర తినడం వల్ల చలువ చేస్తుంది.గోంగూరలో విటమిన్ ఏ, విటమిన్ సి,విటమిన్ b9 పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం,  క్యాల్షియం,పాస్పరస్,సోడియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.అందుకే గోంగూరని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. గోంగూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం...                                               

 గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడమే కాకుండా,రేచీకటి ను కూడా తగ్గిస్తుంది.

 గోంగూర తినడం వల్ల బరువు తగ్గవచ్చు.  ఎందుకంటే గోంగూరలో తక్కువ కొవ్వు,తక్కువ కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా మినరల్స్,విటమిన్స్, కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు.

 గోంగూరలో యాంటీ  యాక్సిడెంట్లు సమానంగా ఉన్నందున కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

 గోంగూరను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గజ్జి, తామర వంటి వాటిపై రాయడం వల్ల ఇవి తగ్గిపోతాయి.

 తాజాగా ఉండే గోంగూర ఆకులను పేస్ట్ గా చేసి చర్మానికి రాసుకోవడం వల్ల ముడతలు తగ్గిపోతాయి. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది.

 నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు ప్రతిరోజు పడుకోబోయే ముందు ఒక కప్పు గోంగూర రసం తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

 వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటే గోంగూర ఆకులను ముద్దగా నూరి ఆ పేస్టును రాత్రి తలకు పట్టించి, ఉదయాన్నే తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది.

 గోంగూరలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల.  ఎముకలను బలంగా దృఢంగా ఉండడానికి గోంగూర సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: