కొర్రలు: వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు సమృద్ధిగా అందుతాయి. కొర్రలలో అధిక పీచు పదార్ధం,ఐరన్, మాంగనీస్, మెగ్నీష్యం, భాస్వరంతో నరాల బలహీనత, మధుమేహ వ్యాధిగస్థులకిది మంచి ఆహరం. శరీరం లోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగిస్తుంది.
అరికెలు : విటమిన్లు, మినరల్స్ పుష్కలంగాఉంటాయి. ఇదీ మన రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు రక్తహీనతను తగ్గిస్తుంది మరియు మలబద్దకాన్ని దూరం చేస్తుంది .అధిక యాంటి ఆక్సిడెంట్ యాక్టీవిటీ కలిగి ఉండి రక్తం లో చెక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
ఉదలు: రుచికి తీయగా ఉంటాయి. బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది .ఇవి ఎక్కువగా లివర్ సమస్య నుండి కిడ్నీల సమస్య నుండి కాపాడుతుంది అలాగే గ్యాస్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికీ ఉధాలు చాల మంచి ఆహరం.
అండుకొర్రలు: వీటిని కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. జీర్ణాశయం, ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు ఊబకాయం నివారణకు ఉపయోగపడతాయి.
రాగులు : ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఎక్కువ ఉంటాయి. అన్ని ఆహార ధాన్యాలు కంటే రాగిలో 7-35 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. మొలకెత్తిన రాగులలో రోగ నిరోధక శక్తి వచ్చే విటమిన్-సి ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే కీళ్ళ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.
సామలు: వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. వీటిలో వున్న అధిక పీచు పదార్ధం వలన నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడు, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణ వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
ఇంతటి పోషకవిలువలు ఉన్న చిరుధాన్యాలను కనీసం రోజులో ఒక్కసారైనా ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. వీటివల్ల అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.