చేపలు  తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే చేపల్లో బీపీని, కొలెస్ట్రాల్ ని, డయాబెటిస్ ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి. అంతేకాకుండా చేపల్లో నాణ్యమైన  ప్రోటీన్లు ఉంటాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, బిపి, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే  అవకాశం తక్కువ . చేపలని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. నిరోధక శక్తి పెరగడానికి కూడా చేపలు ఎంతో దోహదపడతాయి. అంతేకాకుండా..

 చేపలు శరీరానికి చాలా అవసరం ఎందుకంటే చేపల్లో మంచి కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో ఒమేగా 3, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి  గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కడుపులో మంట, వేడి తగ్గాలన్న తప్పనిసరిగా చేపలు తీసుకోవాలి. ఇంకా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు చేపలు తినడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా కండరాల శక్తిని పెంచుతాయి. అలాగే అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరుపు వంటి లక్షణాలను చేపలు తగ్గిస్తాయి. అందుకే చేపలను ఆహారంలో  భాగంగా చేర్చుకోవాలి.

 చేపల్లో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉండేటట్లు తెలుస్తాయి. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్,  ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ క్యాన్సర్లు రాకుండా చేపలు అడ్డుకుంటాయి. టైప్ 1 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు చేపలు తినడం వల్ల మంచి జరుగుతుంది. అంతేకాకుండా విటమిన్ బీ 2 రైబోఫ్లెవిన్ ఉంటుంది.  ఇది శరీరానికి కావలసిన ఆక్సిజన్ ను తీసుకొనెలా చేస్తుంది.

 చేపలను తప్పనిసరిగా  ఎందుకు తినాలి:

 చేపల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని గ్లోబ్ ఇన్ శాతం సరి పడేలా చేస్తుంది. పేగులో క్యాన్సర్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి ఎనర్జీ గా  ఉండేటట్లు చేస్తాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి.

 చేపల్లో అయోడిన్ ఉన్నది వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. కడుపులో బిడ్డ కు మెదడు పెరిగేందుకు ఉపయోగపడతాయి.

 మన శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోతే చేపలను తినడం వల్ల అది మన శరీరానికి అందుతుంది. కాకుండా క్యాల్షియం కూడా అందుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.  అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి.

 చేపల్లో ఉండే పొటాషియం శరీరంలో ద్రవాలు తయారవడానికి చాలా అవసరము. కణాలు  సమర్థవంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరము అందుకే చేపలను తినడం వల్ల పొటాషియం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: