ప్రస్తుతం మనం భోజనం చేయాలంటే ఎంతో స్టైలిష్ గా ఉన్న పింగాణీ ప్లేట్లలో లేదా స్టీల్ కంచాలలో తినడం మనం చూస్తున్నాము. అయితే ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు మాత్రం పేపర్ ప్లేట్లని వాడుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తున్నాము. కానీ పూర్వకాలంలో భోజనం చేయాలంటే తప్పనిసరిగా అరిటాకులు ఉండాల్సిందే. పూర్వీకులు అరటి ఆకులలో భోజనం చేయడం ద్వారా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అరిటాకులో భోజనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని మన పెద్దవారు విశ్వసించేవారు. అయితే అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం...

అరిటాకులలో ఎక్కువగా ఫాలీఫినాల్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, మన కడుపులో ఏర్పడేటటువంటి అలర్జీ ,గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.అరటి ఆకులలో ఎక్కువగా క్లోరోఫిల్ అనే పదార్థం ఉండటం ద్వారా వేడి అన్నం పెట్టుకొని తినడం వల్ల ఆ వేడికి ఆకులో ఉన్నటువంటి పోషక పదార్థాలు అన్నంలో కలిసి మన శరీరంలోకి వెళ్తాయి. తద్వారా ఎటు వంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.                                          

అరిటాకులో పొటాషియం సమృదిగా ఉండటం వల్ల మన శరీరానికి సరిపడినంత పొటాషియం అంది గుండెకు సంబంధించిన వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మన శత్రువులు ఎవరైనా మనపై విష ప్రయోగం చేసిన అరిటాకులు తెలియజేస్తాయి. విషం కలిపిన అన్నం అరిటాకులో పెట్టడం వల్ల అన్నం మొత్తం నీలి రంగులోకి మారుతుంది. అదే విధంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధులను దూరం చేయడంలో కూడా అరిటాకు ఎంతో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: