ప్రతి రోజూ ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చని నీటిలో కి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు వచ్చేస్తాయి. ప్రతిరోజు ఈ అలవాటును పాటించడం ద్వారా శరీర బరువు కూడా తగ్గుతారు. అదేవిధంగా మనం తీసుకున్న ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కాని పక్షంలో మన జీర్ణ వ్యవస్థలో అనేక వ్యర్థ పదార్ధాలు పేరుకుపోతాయి.ఈ వ్యర్థ పదార్థాలను తొలగించాలంటే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ప్రతిరోజు ఎక్కువ సార్లు నీటిని తాగటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. మన శరీరంలో ఏర్పడిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ప్రతిరోజు ఈ దినచర్యలన్ని పాటిస్తూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కేవలం బరువు మాత్రమే తగ్గడం కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ప్రతిరోజు కనీసం ఆరు గంటల వరకు నిద్ర పోవాలి.మన శరీరానికి సరిపడినంత నిద్ర పోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. విటమిన్ సి ఎక్కువగా లభించే సిట్రస్ జాతి పండ్లు తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఈ విధమైనటువంటి ఆహార నియమాలను పాటించడం ద్వారా మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను, మలినాలను బయటకు పంపవచ్చు.