కడుపులో నులిపురుగులు చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది. పెద్దవారిలో కొంత మందిలో మాత్రమే ఉంటాయి. కడుపులో నులి పురుగులు ఉండటం వల్ల కడుపు నొప్పి రావడం, ఆకలి లేకపోవటం, రక్తహీనత, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా  కనిపిస్తాయి. నులిపురుగులు రావడానికి ముఖ్య కారణం అపరిశుభ్రంగా ఉండటం. ముఖ్యంగా పురుగులు ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల నులిపురుగుల  బాధ లేకుండా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో, అవి   ఎలా వాడాలో ఇప్పుడు కలుసుకుందాం...                                                                               

 కడుపులో నులి పురుగులు ఉన్నాయని తెలిన వెంటనే పచ్చి బొప్పాయిని పేస్ట్గా తయారు చేసుకొని ఆ పేస్టును ఒక గ్లాస్ వేడి పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల నులి పురుగులు క్రమంగా చనిపోతాయి.

 కడుపులో  నులిపురుగులు ఉండటం వల్ల చిన్న పిల్లలు చాలా బాధపడుతుంటారు. అలాంటివారికి సీతాఫలం పండు ను తినిపించడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది.

 వెల్లుల్లిని చిన్న ముక్కలు ముక్కలుగా తరిగి ఆ మొక్కలకు తేనె కలిపి రోజు తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల బాధ నుంచి విముక్తి  కలుగుతుంది.

 చిటికెడు పసుపు తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో   నీటిలో వేసి తాగుతూ ఉండటంవల్ల కడుపులో నులిపురుగులు నాశనమవుతాయి. అంతేకాకుండా కడుపు నొప్పి నుంచి ఉపశమనం  కలుగుతుంది.

 వైద్యులు సూచించిన మందులను వాడటమే కాకుండా పైన చెప్పిన చిట్కాలను కూడా వాడటం వల్ల కడుపులో నులి పురుగులు బయటకు పంపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: