మారేడు పండు చెట్టునే  బిల్వ పండు అని కూడా అంటారు. అంతేకాకుండా బిల్వ పత్రం, బిల్వ పండ్లు  పరమేశ్వరునికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. పరమ శివుడిని భక్తి శ్రద్ధలతో బిల్వపత్రాలను మహాశివరాత్రి సందర్భంగా శివుడి పాదాల ముందు సమర్పించి, మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా పరమశివుడు నెరవేరుస్తాడని, అప్పట్లో పెద్ద వాళ్లు చెప్పేవారు.. అయితే కేవలం పరమశివుడికి సమర్పించడమే కాకుండా మారేడు పండు లో దాగిఉన్న ఆరోగ్య విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం..



బిల్వ పండ్లు మరియు ఆకులలో యాంటీఆక్సిడెంట్స్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.  విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. అందులో విటమిన్-ఈ,విటమిన్-సి, రైబోఫ్లేవిన్,క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి1, విటమిన్ బి 6, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి . మన శరీరంలో వాత, పిత్త, కఫ సమస్యలు వస్తుంటాయి కాబట్టి  ఈ పండ్లను తినడం వల్ల ఈ మూడింటిని సరిచేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి.  బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరాన్ని తగ్గించవచ్చని ఒక పరిశోధన ద్వారా తేలింది. అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా శరీరంలో వేడి కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు ఈ బిల్వ పత్రాల రసం తాగితే చాలు ఒంట్లో వేడి ఇట్టే పోతుంది.



బిల్వ పండు తో హైపర్ టెన్షన్ ను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే చెడు కొవ్వు కరిగి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జీర్ణ ప్రక్రియ సరిగా జరగని వారికి  బిల్వ పండు చాలా మేలు చేస్తుంది. పొట్టను శుభ్రం చేయడం, జీర్ణవ్యవస్థను సక్రమంగా మార్చి, రిలాక్స్ ఫీలింగ్ పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.. అయితే కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ముఖానికి, జుట్టుకి ఎంతో ఉపయోగపడుతుంది.



ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఆకుల, పండ్ల రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం మెరవడమే కాకుండా ముఖం పై ఉన్న మచ్చలు కూడా పోతాయి. ఆకుల రసం తాగితే  జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ బిల్లు ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి, ఒక గంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు మెరుస్తూ నల్లబడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: