మొక్కజొన్న లను తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య కూడా ఉండదు. మొక్కజొన్న లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అంతేకాకుండా గర్భధారణ సమయంలో ఒక్కోసారి డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా డయాబెటిస్ రాకుండా ఉండడానికి మొక్కజొన్న ఎంతో దోహదపడుతుంది. కాబట్టి గర్భిణీలు మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి మంచిది.
గర్భిణీలు కాకుండా ఎవరైనా మొక్కజొన్నను తినవచ్చు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొక్కజొన్న లో యాక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉండేటట్లు చేస్తాయి.
ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మొక్కజొన్న లో అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా మెగ్నీషియం, కాపర్, ఐరన్, పాస్పరస్ వంటివి కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడతాయి. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మొక్కజొన్నను ప్రతి రోజు తినడం వల్ల ఆకలి ఎక్కువగా రాలిపోకుండా వాటికి బలాన్ని ఇస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వెంట్రుకలను స్మూత్ గా ఉంచుతుంది.