చాలా మంది పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. నొప్పిని అడవి సేవలకు మాత్రమే  ఆ బాధ తెలుస్తుంది. మామూలుగా చిగుళ్ళు ఉబ్బడం, పిప్పి పళ్ళు, సమస్యలు వస్తుంటాయి. కానీ పిప్పి పళ్ళు సమస్య ఉన్నప్పుడు కచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. కానీ చిగుళ్ళ నొప్పి, పంటి నొప్పి వంటివి ఉన్నప్పుడు కొన్ని టిప్స్ ఉపయోగించడం వల్ల వాటిని నయం చేసుకోవచ్చు.  గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం...

 పంటి నొప్పి రాగానే ఏవో మాత్రలు వేసుకుంటూ ఉంటారు. వాటికంటే  ఐస్ ముక్కలను ఒక గుడ్డలో తీసుకొని పంటినొప్పి ఉన్నచోట పెట్టడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

 వెల్లుల్లి తో కూడా పంటి నొప్పిని నివారించవచ్చు. ఇందులో యాంటీబయటిక్ గుణాలు ఉండటం వల్ల అయినప్పటికీ నొప్పి ఉన్నా కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లిని  ఈ విధంగా వాడాలి. వెల్లుల్లిని  బాగా దంచి అందులోకి కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న పంటిపై పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

 మనం  తినే ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయిన వీటి వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. తద్వారా పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలా జరక్కుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల పళ్ళల్లో  లో పేరుకుపోయిన వ్యర్త పదార్థాలు బయటకు పోతాయి. ఫలితంగా పంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

 లవంగాలు,  లవంగాల నూనె పంటి నొప్పిని నివారించడానికి బాగా సహాయపడుతాయి. పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు  ఒక లవంగం తీసుకొని నొప్పి ఉన్న చోట పెట్టాలి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

 చిగుళ్ల నొప్పితో బాధపడుతున్నప్పుడు.  వీటిని తగ్గించడానికి ఆవనూనె బాగా ఉపయోగపడుతుంది. ఆవ నూనె తీసుకొని అందులో కొంచెం ఉప్పు కలిపి తలకు అప్లై చేయాలి. ఇలా  చేయడంవల్ల నొప్పినుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

 పంటి నొప్పి ఎక్కువ బాధ పడుతున్నప్పుడు వెంటనే తగ్గడానికి ఒక ఉల్లిగడ్డ ముక్కను తీసుకొని నొప్పి ఉన్న పంటిపై పెట్టడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

 పంటి నొప్పికి పుదీనా కూడా బాగా ఉపయోగపడుతుంది.  ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పితగ్గడానికి సహాయపడుతాయి. కాబట్టి పంటి నొప్పి ఉన్న చోట పుదీనా ఆకును మెత్తగా  నూరి పంటిపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: