తృణధాన్యాలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వాటిని మొలకెత్తించి తినడం వల్ల ఇంకా మంచిది. శనగలను, పెసులను మొలకెత్తించి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. మొలకల విత్తనాలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి 6, విటమిన్ కె అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అందుకే మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలతో పాటు విటమిన్స్ కూడా అందుతాయి. మొలకలు ఉన్న గింజల్లో విటమిన్ ఏ ఎనిమిది రెట్లు  పెరుగుతుంది. అలాగే మొలకలు తినడం వల్ల  ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవాళ్లకి ఇది చాలా మంచివి. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తాయి.

 మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల శరీరానికి  కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు, గోర్లు చర్మము ఇవన్నీ ఆరోగ్యంగా పెరగడానికి మొలకెత్తిన విత్తనాలు సహాయపడుతాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటివి రాకుండా కూడా కాపాడతాయి.

 శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అంది ఎందుకు మొలకెత్తిన విత్తనాలు సహాయపడుతాయి. అలాగే జీర్ణక్రియ మెరుగు పడటానికి విత్తనాలు ఎంతో దోహదపడతాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది.

 మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, బీ కాంప్లెక్స్ అధికంగా ఉంటాయి. అందుకే మొలకెత్తిన  విత్తనాలను  రోజు తీసుకోవడం చాలా మంచిది.

 బరువు తగ్గాలనుకొనే వారికి మొలకెత్తిన విత్తనాలు బాగా సహాయపడుతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

 మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా తెల్ల రక్త కణాలు శక్తివంతంగా  పని చేయడానికి ఈ విత్తనాలు చాలా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: