సాధారణంగా వంట గదిలో ఉపయోగించే మసాలా దినుసులలో అతి ముఖ్యమైన దినుసు ధనియాలు.  ధనియాలు మనకు వివిధ రకాలుగా  ఉపయోగపడతాయి. మనం ఉపయోగించే వంటలకు మంచి సువాసన ఇవ్వడమే కాకుండా మంచి రుచిని కూడా అందిస్తాయి.  అంతేకాకుండా ధనియాలను నిత్యం తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ధనియాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాము..


ధనియాలను కషాయం చేసుకొని నిత్యం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు అంతా కరిగి పోతుంది. తద్వారా అధిక బరువు కూడా తగ్గే అవకాశాలు  ఎక్కువ. ఫలితంగా గుండె సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.


అజీర్తి వంటి సమస్యలను కూడా దూరం చేసి,  కడుపును శుభ్రంగా ఉంచుతుంది. అంతేకాకుండా ధనియాలను నిత్యం తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది.  ధనియాలు డయాబెటిస్ రోగులకు ఎంతో మంచి ఔషధంగా పనిచేస్తాయి. గర్భవతులు రోజువారి ఆహారంలో ధనియాలను చేర్చుకోవడం వల్ల, ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎలాంటి హానీ కలగకుండా ఉంటుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, పుల్ల తేపులు వంటి సమస్యలు ఉన్నవారికి ధనియాలను శుభ్రం చేసి,  కావలసినంత ఉప్పు జోడించి దోరగా వేయించాలి. ఇప్పుడు ఈ ధనియాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య నుంచి బయట పడవచ్చు.


కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి.
బియ్యం కడిగిన నీటిని తీసుకొని , అందులో ధనియాలు నానబెట్టాలి. ఆ తర్వాత ధనియాలు తీసి  మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి, కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం  వంటివి మటుమాయమవుతాయి.
వేసవిలో విపరీతమైన దాహం ఉంటుంది. కానీ ఆకలి తక్కువగా వేస్తుంది. ఇందుకోసం ఉదయాన్నే ధనియాలు తీసేసిన  బియ్యం నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుతుంది. అంతేకాదు కిడ్నీ సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: