ఎలాంటి ఒత్తిడి..ఆందోళన లేకుండా జీవించడం ఎవరికీ సాధ్యం కాదు. కుటుంబ సమస్యలో..ఆఫీస్ లో పని ఒత్తిల్లో...ఏవైనా ఇతర సమస్యలో ఉంటూనే ఉంటాయి. అయితే ఒత్తిడి రెగ్యులర్ గా ఉంటే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఒత్తిడికి రెస్పాన్డ్ అయ్యే విధానం మార్చుకోవాలి. అంతే కాకుండా కొన్ని పడ్దతులను పాటించడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైతే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. కాబట్టి ప్రతి రోజు నచ్చిన వ్యాయామం చేయడం మంచిది. దీంతో శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

ఎసెన్సియల్ ఆయిల్స్ వాడటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా సెంట్ లు మనసుకి రిలాక్సింగ్ గా ఉంటాయి. లవెండర్, రోజ్, ఆరెంజ్ ,శాండల్ వుడ్ వంటి సెంట్ లు ఒత్తిడిని దూరం చేస్తాయి.

కాఫీ , టీ, చాక్లెట్ లు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఆందోళన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు రెండు కంటే ఎక్కువ సార్లు కాఫీ, టీ తాగకూడదు.
నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆందోళనలో ఉన్నప్పుడు నవ్వడం అంత సులువు ఏమీకాదు. కానీ కామెడీ వీడియోలు చూడటం అలవాటు చేసుకోవాలి.

సంగీతం వినటం వల్ల ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి. ప్రతి రోజు మనకు నచ్చిన పాటలను వినాలి. పాట‌లు విన‌టం వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌త వ‌స్తుంది. దాంతో ఆంద‌ళ‌న దూర‌మౌతుంది. అంతే కాకుండా దానికి ఒక సమయాన్ని కేటాయించాలి.

స్ట్రెస్ ను హ్యాండిల్ చేయ‌డానికి ఒక ప‌ద్ద‌తి ఉంది. ప్ర‌తి రోజు అస‌లు స్ట్రెస్ కు ఎందుకు గుర‌వుతున్నారో ఒక డైరీలో రాసుకోవాలి. అంతే కాకుండా మీ జీవితంలో వేటికి కృత‌జ్క్ష‌త క‌లిగి ఉన్నారో రాసుకోవాలి. దాంతో  ఆందోళ‌న త‌గ్గుతుంది. లైఫ్ లో పాజిటివ్ విష‌యాల మీద ఫోక‌స్ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: