అంటే ఒక కప్పు పంచదార స్టీవియా ఆకులతో తీసిన ఒక స్పూను రసానికి సమానం అన్నమాట. స్టీవియా ఆకులను వాడడం వలన ఎటువంటిిి అదనపు క్యాలరీలు మన శరీరంలోకి చేరవు. అంతేకాకుండా దీని వలన శరీరం యొక్క బరువు తగ్గుతుంది. అది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణ శక్తిని పెంచి కడుపులో మంట, గ్యాస్ వంటి వాటినీ తగ్గిస్తుంది.అలాగే రక్తపోటు అదుపులో ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ఈ ఆకులు నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మధుమేహం ఉన్న్నవారికి దీని వలన అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నవి. తీపి పదార్థాలు తిన్న తరువాత స్టీవియా తీసుకుంటే శరీరంలో చెక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే ఇన్సులిన్ విడుదలలో ప్రధాన పాత్ర పోషించి రక్తంలో గ్లూకోజ్ కూడా అదుపులో ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారుచక్కెరకు ప్రత్యామ్నాయంగా స్టీవియా ఆకుల పొడిని వాడవచ్చు. అంతేేేే కాకుండా ఈ మొక్కలో ఉన్న యాంటీీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వలన చర్మ వ్యాధులను సైతం తగ్గించి, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.ఇలా ఈ మొక్క ఆకులను నీడలో ఆరబెట్టి పౌడరు లాగా తయారు చేసుకుని పంచదారకు ప్రత్యామ్నాయంగా టీ కాఫీ లలో వాడవచ్చు. కషాయం రూపంలో గాని లేహ్యం రూపంలో గాని వాడవచ్చును. అలాగే పచ్చి ఆకులను కూడా నమిలి తినవచ్చు. అయితే దీనికున్న అత్యంత తీపి గుణం వల్ల అతి కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి.