
ఆయుర్వేదం ప్రకారం.. సబ్జా గింజల నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఆ పానీయం వల్ల శరీరానికి చలవ చేస్తుందట. మధుమేహం, డీహైడ్రేషన్, అధిక బరువు, మలబద్ధకం, శ్వాసకోస వ్యాధులకు సబ్జా గింజలు మంచి ఔషదంగా పనిచేస్తాయట. రోజూ గుప్పెడు సబ్జా గింజలను తీసుకోవడం మంచిదేనట. సబ్జా గింజల్లో రాళ్లు, మట్టి ఉండే అవకాశం ఉంది. కాబట్టి.. ముందుగా వాటిని తీసేసి మంచి నీళ్లతో బాగా శుభ్రం చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో గంటపాటు నానబెట్టండి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా జిగురులా మారతాయి. ఇలా మారిన సబ్జా గింజల నీటిలో నిమ్మకాయ, చక్కెర కలుపుకుని తాగండి.
సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది.వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం.గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావు.సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి.సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి.సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.
రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు.శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది.జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఊబకాయంతో బాధపడే చాలా మందికి సబ్జా గింజల పానీయం చాలా మంచిది.ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తీసుకుంటారు.చక్కెర వేయకుండా సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
సబ్జా గింజల్లో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువ. ఇది జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది. రాత్రి పడుకునేటప్పుడు గ్లాసు సబ్జా గింజల డ్రింక్ తాగితే చాలు... తెల్లారాక శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. కడుపులో మంట, ఉబ్బరం, ఆసీడిటీ, అజీర్తి లాంటి సమస్యలకు చెక్ పెడతాయి.డయాబెటిస్ ఉన్నవారు పంచదార వేసుకోకుండా సబ్జా వాటర్ తాగితే సమస్య కంట్రోల్ అవుతుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ సెట్ అవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన సబ్జా గింజల్ని గ్లాసు పచ్చిపాలలో వేసుకొని కొన్ని చుక్కల వెనీలా కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.నోట్లో వికారంగా, వామ్టింగ్ వచ్చేలా ఉంటే సబ్జా గింజల జ్యూస్ తాగాలి