నిత్యం ఆరోగ్యంగా ఉండటానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. తినే ప్రతి ఫుడ్‌లో ప్రొటీన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా ఆహార పద్ధతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.బీట్‌రూట్, బ్రకోలీ, స్పైనాక్, గ్రీన్ పీస్ పౌడర్లతో ఈ డిషెసే కాకుండా కుకీస్, నూడిల్స్, సూప్, దోశలు కూడా తయారు చేసుకోవచ్చు.బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గేందుకు దోహదపడతాయి.శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.బీట్‌రూట్‌లో విటమిన్ సి, పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులోని విటమిన్ ‘బి’ జీవ క్రియ, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది.
స్పినాక్‌లో పూర్తిగా పోషకాలే. కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణమున్న స్పినాక్‌లో కాన్సర్ కారకాలను నిరోధించే రసాయనాలు కూడా ఉన్నాయి.వారంలో ఓ రోజు కచ్చితంగా ఓ కప్పుకు తగ్గకుండా స్పినాక్ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.గ్రీన్ పీస్‌లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.బ్రకోలీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. డయాబెటిస్‌ను నియంత్రించడంలో బ్రకోలీ బెస్ట్ ఫుడ్. కీళ్లనొప్పులు, అలర్జీలను తగ్గించేందుకు బ్రకోలీ సహయాపడుతుంది. విటమిన్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే బ్రకోలీని రెగ్యులర్‌గా తీసుకుంటే గుండె పదిలంగా ఉంటుందట.జీడి పప్పు, బాదం, పిస్తా వంటి కాస్ట్‌లీ నట్స్ మాత్రమే ప్రొటీన్ రిచ్ అనుకుంటే పొరపాటే. మన కూరగాయల్లో ఎక్కువగా ఉపయోగించే బీట్‌రూట్, బ్రకోలీ, గ్రీన్ పీస్‌లోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయని హెల్త్ ఎక్స్‌పర్స్ట్ చెబుతున్నారు. ఇక అలానే నిత్యం పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు తినండి. ఇక డ్రై ఫ్రూట్స్ తినడం మర్చిపోకండి. డ్రై ఫ్రూట్స్ ఒంటికి చాలా మంచివి. ఇక డేట్స్ తినటం వలన బాడీకి ఐరన్ ఎక్కువవుతుంది. కాబట్టి డేట్స్ తినండి...ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...