ఈ నేషనల్ ఆటిజం హెల్ప్ లైన్ ద్వారా ఆటిజం బాధిత కుటుంబాలు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులు వారి ఎదుగుదలలో వచ్చే మార్పులు, లోపాలు వాటి పరిష్కార మార్గానికి సంబంధించి ఉచితంగా సలహాలు, గైడెన్స్ పొందవచ్చని పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సంస్థ వెల్లడించింది.
ఆటిజం అనేది చిన్నతనంలో వచ్చి జీవితాంతం ఉండే సైకలాజికల్ - న్యూరోలాజికల్ డిజార్డర్, 104 సంవత్సరాలుగా ఆటిజానికి మందు కాదుకదా కారణాన్ని కూడా కనిపెట్టలేకపోయింది మన అధునాతన సైన్స్.
ఆటిజంతో బాధపడుతున్నపిల్లల్లో సహజంగా సెన్సోరియాల్, మానసిక సమస్యలు ఉంటాయని, మెదడు ఎదుగుదల కావలసిన రీతిలో ఉండదని, నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటారని, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరని, వెలుగుని, శబ్దాన్ని కూడా భరించలేరని, ఇంకా మరెన్నో సమస్యలతో బాధపడుతుంటారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను చూసి తల్లిదండ్రులు మానసికంగా బాధపడుతూ.. సంవత్సరాల తరబడి తమ బిడ్డలను కంటికి కునుకు లేకుండా కాపాడుతూ, తమ తరువాత వారి పరిస్థితి ఏమిటీ అనే క్షోభలో ఉంటున్నారని... వారికి కావలసిన సలహాలు, గైడెన్స్ కోసం ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపింది పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ సంస్థ.
ఆటిజంతో పుట్టిన పిల్లలు శాపగ్రస్తులు కారనీ, నాణ్యమైన ఇంటిగ్రేటెడ్ ఆటిజం థెరపీ సర్వీసులను ఇప్పించడం ద్వారా వారు సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా, తమ ఆటిజం సంబంధిత సెన్సోరియాల్ సమస్యలను అధిగమించి తమకంటూ జీవితాన్ని ఏర్పరచుకునెలా తలిదండ్రులు కృషిచేయాలని, ఈ ప్రయత్నంలో ఉచిత నేషనల్ ఆటిజం హెల్ప్ లైన్ 9100 181 181 సర్వీసులను వినియోగించుకోవాలని కోరుతూ.. ఈ హెల్ప్ లైన్ లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ మాతృ సంస్థ భారత్ హెల్త్ కేర్ ప్రై. లిమిటెడ్ వ్యవస్థాపకులు, డా. శ్రీజ రెడ్డి . సరిపల్లి.
https://pinnacleblooms.org
https://pinnacleblooms.org/services
https://pinnacleblooms.org/enroll