అయితే ఇందులో శోథ నిరోధకాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను పెంచడానికి ఇతర ఆరోగ్య వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. అయితే దీనితో టీ కూడా రెడీ చేసుకోవచ్చు. మరీ దానిని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక బాణాలిలో నీరు పోసి మరిగించాలి. నీరు వేడి అయిన తర్వాత వాటిని దించి కాస్తా చల్లార్చి అందులో సుమారు 4-5 లవంగాలు, తురిమిన అల్లం, దాల్చిన చెక్కలను అందులో కలపాలి. వాటిని నీటిలో సుమారు 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి వడకట్టి ఒక టీస్పూన్ తేనే, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. అంతే లవంగం టీ రెడీ.
ఇక ఈ మసాలా టీ మీ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. లవంగం టీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉండే సమ్మేళనం మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహయపడుతుంది. అలాగే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది.
అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇది ముడతలు, వయసు మచ్చలు కనిపించకుండా చేస్తుంది. ఈ టీ సైనస్ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. యూజీనాల్ ఉండటం వల్ల ముక్కు సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్ ఇ , విటమిన్ కె ఉంటాయి. ఇవి బాక్టీరియాతో పోరాడతాయి. జ్వరంను కూడా తగ్గిస్తాయి. చిగుళ్లు, పంటి నోప్పిని తగ్గిస్తాయి.