ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. అందువల్ల మనము బరువు ఎక్కువై గుండె సమస్యలు వస్తుంటాయి. అలాంటివారికి ఈ చేమ దుంపలు చాలా ఉపయోగపడతాయి. ఈ దుంపలలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్య పోతారు. దుంపలలో కొన్నింటిని పచ్చిగానే తినవచ్చు. మరి కొన్నిటిని వండుకొని తినవచ్చు. చేమదుంపలను వండుకొని మాత్రమే తినగలం. ఇవి జిగురుగా ఉంటాయని చాలా మంది తినేందుకు ఇష్టపడరు.

అయితే నిజానికి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చేమదుంపలను ఉడికించి, కాల్చుకొని తినొచ్చు. మాంసానికి బదులుగా వీటిని తినడం వల్ల మంచి రుచిని,పోషకాల్ని పొందవచ్చు. 100 గ్రాముల చేమదుంపల లో 120 గ్రాముల కేలరీల శక్తి ఉంటుంది. వీటిలో ఎక్కువగా కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి. పీచు పదార్ధాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలో కి గ్లూకోజ్ ను స్థిరంగా విడుదల చేస్తాయి.

ఇలా రక్తప్రసరణ చేయడం వలన షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు.  పైగా వీటి వల్ల బాడీలో ఎనర్జీ ఎక్కువ సేపు ఉంటుంది. చేమదుంపలు బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతాయి. మిగతా దుంపలలాగే వీటిలో కూడా పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పిండి పదార్థాలు ఉండటం వల్ల గుండెకు చాలా మంచిది. వీటిలో పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్ ధమనులలో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది.

గుండె జబ్బులకు, హైపర్ టెన్షన్ కు కారణమయ్యే బ్లడ్ స్థాయిలను తగ్గించడానికి,  అవసరమైన  విటమిన్ ఈ, విటమిన్ ఏ ను ఈ దుంపలు అందిస్తాయి. అంతేకాకుండా అరుదుగా లభించే B6 విటమిన్ ను ఈ దుంపలు అందిస్తాయి. చేమదుంపలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ దుంపలు మనలో విషపదార్థాలను పేరుకు పోకుండా కాపాడుతాయి.

చేమదుంపల వల్ల మహిళల్లో ఎండోక్రైన్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. రాత్రివేళ చెమట,తడి ఆరటం వంటి లక్షణాలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కండరాల నొప్పులు, అలసట నుంచి రక్షించడానికి ఈ దుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే చేమదుంపల ను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం ఉత్తమం.


మరింత సమాచారం తెలుసుకోండి: