కరోన విపత్కర పరిస్థితుల్లో చాలా మంది స్వచ్ఛంగా
సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు.కొంతమంది కరోనా బాధితులకు రెండుపూటలా భోజనాన్ని అందిస్తుంటే మరికొంత మంది నిత్యవసర వస్తువులు,ఆర్థికసాయం చేస్తున్నారు.అయినవాళ్లే కాదనుకుంటున్న ఈ సమయంలో మేము సైతం అంటూ పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే
మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.పలువురు సామాజిక కార్యకర్తలు కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేరుస్తూ వారి బాగోగులు చేస్తున్నారు.అయితే ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ కొరత తీవ్రస్థాయిలో ఉంది.ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్సోయారు.దీంతో చాలా మంది దాతలు ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.ఇప్పటికే విలన్ సోనూసూద్ దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇదే బాటలో మరికొంత మంది సెలబ్రిటీలు నడుస్తున్నారు.కొంత మంది స్వచ్ఛందంగా 100 పడకల బెడ్లు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
https://twitter.com/smitapop/status/1394220795736444928?s=08విపత్కర పరిస్థితుల్లో పాప్ సింగర్ స్మితా కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన టీమ్‌తో కలిసి పలు ప్రాంతాల్లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లకు వంద ఆక్సిజన్ బెడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఫోటోలను షేర్ చేస్తూ తన టీం చేస్తోన్న సేవా కార్యక్రమాలను వివరించారు. నా టీంకు ఎంతో రుణపడి ఉంటాను.. వారు ఎప్పుడూ కూడా నన్ను ఓడిపోనివ్వలేదు.. ఎలాంటి పని అని చూడకుండా ఎంత కష్టం అని ఆలోచించకుండా నా కోసం చేసేశారు. ఒక వేళ వారంటూ లేకపోతే నా కలలన్నీ కలలుగానే ఉండిపోయేవి,,. వంద బెడ్ల ఆక్సిజన్‌ను నిజం చేయడంలో వారెంతో సహకరించారు.. ఫ్యూజన్
విజయవాడ, బబుల్స్
విజయవాడ టీంకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.ఆక్సిజన్ బెడ్లు రెడీ అవుతున్నాయని.త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్మిత పేర్కొన్నారు.