సాధారణంగా వర్షాకాలంలో అరటి చెట్లు గాలికి విరిగిపోతుంటాయి. ఈ సందర్భంలో ఆకులు, పండ్లు మాత్రమే కాకుండా కాండం కూడా ఇంటికి తెచ్చుకోండి. ఆ కాండాన్ని తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటి చెట్టు ని ఎలా తినాలో తెలియక చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అయితే ఇది తెలుసుకోండి.
అరటి చెట్టును మధ్యలో కత్తిరించి, లోపల కనిపించే తెల్లని దిండు లాంటి పదార్థాన్ని తీసుకోవాలి. దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి, తినవచ్చు. అందులో కనిపించే తెల్ల అరటి పండు ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతుంది.
1). గోళ్ళు కొరికే అలవాటు ఉన్నవారు ఈ అరటి చెట్టు లోని మధ్యభాగాన్ని తినడం వల్ల కడుపులోని మలినాలు, వెంట్రుకలు తొలిగిపోతాయి.
2). అంతేకాకుండా మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
3). శరీరంలో పేరుుపోయిన కొవ్వును కరిగించే శక్తి ఉందని పురాతన కాలం నుంచి ప్రజలు విశ్వసిస్తున్నారు. అరటి దిండుతో చేసిన రసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య తగ్గుతుంది. అరటి పండ్లలో పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది.
4). రక్త హీనతను నివారించడం తోపాటు.. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మరియు విటమిన్ బి కూడా పుష్కలంగా లభిస్తుంది.
5). కరోనా వైరస్ సోకిన వారు అరటి దిండు తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది కనుక.
6). అరటి పండ్లు తినడం వల్ల బరువు సమతుల్యం అవుతుంది. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలు తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
7). 100 గ్రాముల అరటిలో 13 కేలరీలు, 2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఒక గ్రామ్ ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్యలను కూడా నివారిస్తుంది.