రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్లవరకూ ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. మరోవైపు గర్భంలోని శిశువుకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విజయవాడలోని ఓ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. అయితే నాలుగు రోజులకు ఆ చిన్నారికి తీవ్రమైన జ్వరం చర్మంపై కమిలిన మచ్చలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. విజయవాడలోని
బాబ్జీ అనే వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కాగా ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తరవాత తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. కానీ నాలుగు రోజుల తరవాత బిడ్డకు తీవ్రమైన జ్వరంతో పాటు చర్మంమై కమిలిన ఎరుపు, నీలి రంగు గాయాలు కనిపించాయి. దాంతో ఆందోళన చెందిన వైద్యులు వెంటనే చిన్నారిని ఆంధ్ర హాస్పిటల్ కు తరలించారు. దాంతో వైద్యులు మొదట తల్లికి కరోనా ర్యాపిడ్ చేశారు. కానీ నెగిటివ్ రిపోర్డ్ వచ్చింది.
చిన్నారికి కూడా కరోనా పరిక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో యాంటీ బాడీస్‌ని కూడా గుర్తించారు. దాంతో లక్షణాలు లేకుండానే తల్లికి
కరోనా వైరస్ సోకి ఉంటుందని, ఆమె కోలుకోవడంతో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లి ద్వారా శిశువుకి కూడా యాంటీ బాడీస్ చేరినట్లు గుర్తించారు. దాంతో చిన్నారికి నియో నేటల్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. దాంతో ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై ఆంధ్రా హాస్పిటల్స్
డైరెక్టర్ మాట్లాడుతూ....అప్పుడే పుట్టిన పిల్లల్లో చర్మానికి గాయాలు ఏర్పడడం అరుదైన విషయమని చెప్పారు. ఇలాంటి స్థితిని వైద్య పరిభాషలో 'నియోనేటల్ పర్పురా ఫుల్మినన్స్' అంటారని తెలిపారు. అంతే కాకుండా దీనిని పిల్లలలో మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ అని పిలిచే కోవిడ్ సమస్య గా గుర్తించారు. ఈ సమస్య వచ్చిన పిల్లల్లో వాంతులు, విరేచనాలు, చర్మంపై కమిలిన గాయాలు కనిపిస్తాయని తెలిపారు.