ప్రకృతి మనకు ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలపడం చాలా కష్టం. ప్రకృతి వైద్యం కనుక తెలిసినట్లయితే , బయట ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.అంతేకాదు ఎక్కువ కాలం కూడా జీవించవచ్చు. మనం తీసుకునే ఆహారం ఏదైనా సరే సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన ఆహారం తినడం వల్ల, ఎక్కువ ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఆనందంగా కూడా జీవించగలుగుతాం. ముఖ్యంగా కాయగూరలు, తాజా పండ్లు , ఆకుకూరలు వంటివి ప్రధానమైనవి. మనం ప్రతి రోజూ వండుకొని తినే కాయగూరలలో కొన్నింటిని పచ్చివే తినవచ్చు. అలాంటి వాటిలో బెండకాయ కూడా ఒకటి. అయితే బెండకాయ గురించి ఉపయోగాలు ఏంటి. అవి ఏ రోగాలను నివారిస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1). బెండకాయలలో ముఖ్యంగా విటమిన్ A,B6, విటమిన్ C, విటమిన్ E పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా క్యాల్షియం, కాపర్, జింక్, మెగ్నీషియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తాయి.
2). బెండకాయలు పచ్చిగా తినడం వల్ల మన ఒంట్లో ఉండే కొవ్వును కరిగించి వేస్తుంది.
3). బెండకాయ తినడం వల్ల ముఖము ప్రకాశవంతంగా మారుతుంది.
బెండకాయ ఏ ఏ జబ్బులను నయం చేస్తుందో చూద్దాం.
1). బి పీ ఏక్కువగా ఉన్నవారు ఈ కాయలను 5రోజుల పాటు క్రమం తప్పకుండా తినడం వల్ల ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు.
2). కొంతమందికి తరచూ నోరు ఎండిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఈ కాయలు తినడం వల్ల నార్మల్గా ఉంటుంది.
3). దగ్గు ఎక్కువగా ఉన్నవారు ఈ కాయలు తినడం వల్ల తగ్గుతుంది.
బెండకాయలను సహజసిద్ధంగా పండించిన్నప్పుడు మాత్రమే తినడం మంచిది.
అయితే ఈ బెండకాయలు ఎలా తినాలో తెలుసుకోండి.
లేత బెండకాయలను తీసుకొని వేడి నీళ్లలో, బెండకాయలను కట్ చేయకుండా అలాగే వేయాలి. అలా వేసిన బెండకాయలను పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించాలి. అలా మరిగించిన బెండకాయలను ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట, రెండు లేదా మూడు చొప్పున తినడం వల్ల బిపి పెరుగుదలను నివారించవచ్చు.