ప్రస్తుత జీవితంలో ప్రతి ఒక్కరూ నిద్ర లేమిసమస్యతో బాధపడుతున్నారు. అయితే దీనికి విపరీతమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఒక కారణం అయితే పెరిగిన టెక్నాలజీ ఒక కారణం. స్మార్ట్ ఫోన్స్ వాడకం వల్ల కూడా నిద్ర పట్టదు. అయితే ఈ సమస్య నుండి బయట పడటానికి ఈ చిట్కాలను ట్రై చేయండి.

ఆహారం లేకపోయినా ఉండొచ్చు కానీ నిద్ర లేకపోతే జీవించలేము.  అంతేకాదు మేధస్సు కూడా మందగిస్తుంది. అందానికి, ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే ప్రతి మనిషి కనీసం రోజుకి 6గంటలు నిద్రించాలి.

1.ఆలివ్ ఆయిల్ ని వేడిచేసి అరచేతులను మర్ధన చేసి చేతులకు గ్లవుస్ లు వేసుకొని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
2. మారేడు కషాయం రోజుకి నాలుగు సార్లు తీసుకుంటే  మంచి నిద్ర పడుతుంది.
3. నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండాలి. తర్వాత ఘాడంగా శ్వాస తీసుకుని రెండు సెకన్ల పాటు బిగబట్టి వదులుతూ ఉండాలి. క్రమంగా ఇలా చేయడం వల్ల  ఒక విధమైన ప్రశాంతత చోటుచేసుకుని మంచి నిద్ర వస్తుంది.
4. ఆపిల్, జామ, తోటకూర, బంగాళా దుంపలు, క్యారెట్ జ్యూస్ లను రోజు సాయంత్రం తాగితే ఎంత నిద్ర పట్టని వారికైనా నిద్ర పడుతుంది.
5. కొబ్బరి నూనె ని పడుకునే ముందు అరికాళ్లకి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం విశ్రాంతి పొంది వెంటనే గాఢ నిద్ర పడుతుంది.
6. ప్రతి రోజు పడుకునే ముందు ఒక కప్పు సోయా మిల్క్ లో కొద్దిగా తేనె కలిపి తాగితే నిద్ర లేమి తగ్గుతుంది.
7. ప్రతి రోజూ రాత్రిపూట ఒక గ్లాస్ పాలల్లో కొద్దిగా సీమ బాదం పప్పులు, కొద్దిగా పంచదార కలిపి సేవిస్తే నిద్రలేమి సమస్య మాయం అవుతుంది.
8.ప్రతి రోజూ ఉడికించిన గుప్పెడు అలసందలను తింటే నిద్రలేమికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

9. ప‌డుకునే ముందు మొబైల్ ఫోన్ ను అస్స‌లు ప‌ట్టుకోకండి. ఎందుకంటే ఫోన్ చూస్తుంటే నిద్ర‌ప‌ట్ట‌దు. ప్ర‌స్తుతం ఎక్కువ మందికి నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం కూడా రాత్రి స‌మయాల్లో ఫోన్ లు ప‌ట్టుకుని కాల‌క్షేపం చేయ‌డ‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: