గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో అనే విషయం అందరికి తెలిసిందే. అయితే, షుగర్ వ్యాధితో బాధపడేవారు గుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది భావిస్తారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని ఓ అధ్యయనంలో తేలింది. ఇక గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువని తేలింది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలోనూ గుడ్డు వల్ల అనేక గుండె సమస్యలు తగ్గాయని అధ్యయనంలో పేర్కొనడం జరిగింది.ఇక "సిడ్నీ యూనివర్సిటీ"పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం తెలిసిందేంటంటే గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదట.సంవత్సరంలో వారానికి 12 గుడ్లు తింటే డయాబెటీస్ ఇంకా టైప్-2 డయాబెటీస్‌ రోగులకు గుండె జబ్బుల ముప్పు అనేది ఇక ఉండదట. ఇక 3 నెలల క్రితం జరిపిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వెల్లడి కావడం విశేషం.

ఈ పరిశోధనలో పాల్గొన్నవారిని మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది. వారానికి 12 గుడ్లు, మరికొందరికి వారానికి 2 లేదా ఒక గుడ్డు చొప్పున తినాలని సూచించడం జరిగింది. 3 నెలలపాటు వీరికి గుడ్లుని అందించారు. మొదటి గ్రూపు వారికి గుడ్లు తక్కువ ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరిగింది. అలాగే రెండో గ్రూపువారికి వెయిట్ తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇచ్చారట. ఇక చివరి గ్రూపువారికి ఆరు నెలలు నుంచి 12 నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినాలని సూచించడం జరిగింది.ఇక గుడ్లు తిన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనపించలేదట. గుడ్లు తినడం వల్ల అందులోని ప్రొటీన్లు ఇంకా సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని పరిశోధకులు పరిశోధించి వెల్లడించడం జరిగింది. గుడ్డును తింటే కళ్లు ఇంకా గుండె ఆరోగ్యం అలాగే రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. గర్భవతులు గుడ్డు తింటే చాలా వారికి అలాగే పుట్టబోయే బిడ్డకి చాలా మంచిదని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: