ప్రస్తుత కాలంలో మానవుడు అందానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కొంతమందిని అధిక బరువు ఎంతో వేధిస్తోంది. నాజుగ్గా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎన్నో ఖర్చు  చేస్తున్నారు. ఎన్నో మందులు వాడుతున్నారు. కానీ వాటి వాడకం వల్ల చేయడానికి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సహజసిద్ధంగా బరువు తగ్గాలని ఆలోచన చాలామందికి వస్తుంది.

అయితే తెలుగు ప్రజలు బీరకాయ అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ ఆ బీరకాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుంటే  ప్రతిరోజు బీరకాయ కర్రీనే తింటారు. కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా  మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీరా సంజీవనిగా పనిచేస్తుంది. దీంతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునేవారికి బీరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. సహజంగా బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు ను సైతం సులభంగా కరిగించి శక్తి బీరకాయ సొంతం.

           మధుమేహానికి ఎంతో మేలు
 నిత్యం బీరకాయ తినడం వల్ల శరీరంలో చక్కెర శాతం ఎక్కువ కాకుండా నిరోధిస్తుంది. మరోవైపు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ పద్ధతిలో ఉంచుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పేప్టిడ్స్, ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల చేయ రక్షణ వ్యవస్థ బలంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్నవారు  నిత్యం బీరకాయను ఉపయోగించడం వల్ల చాలా లాభం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

                   రోగ నిరోధక శక్తి పటిష్టం
 మీరు నిత్యం లివర్, నేత్ర సమస్యలతో బాధపడుతున్నారా అయితే మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం అవుతోంది. ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఖనిజాలు, ఐరన్ మాగ్నీషియం, థయామిన్ వంటి పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: