టేబుల్ రోజా లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే , ఈ మొక్కను అసలు ఎవరు వదిలిపెట్టరు. ఈ మొక్క చర్మం మీద ఉండేటువంటి నల్లటి మచ్చలను, మొటిమలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్కలో వున్న పువ్వును కోసుకొని, ఒక మెత్తని పేస్టులాగా చేసి, అందులోకి కొంచెం తేనెను కలిపి ముఖానికి పూసి, చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల, ముఖం చాలా అందంగా మెరుస్తుంది. దీనిని ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన తప్పకుండా ఫలితం లభిస్తుంది.
ఇక జుట్టు సమస్య ఎక్కువగా ఉండేవారికి ,ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కల కాండం, ఆకులను బాగా ముద్దగా నూరి, అందులోకి కొంచెం కొబ్బరి నూనె/ఆయుర్వేదం కలిగినటువంటి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించుకోవడం వలన జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.
ఈ మొక్క యొక్క రసాన్ని ఏదైనా గాయాలు అయినప్పుడు పట్టించడం వలన, ఆ గాయం నుండి రక్త ప్రసరణ ఆగిపోతుంది.
ఇక అంతే కాకుండా చర్మం పై వచ్చిన పొక్కులను (క్షయ వ్యాధి పొక్కులు) పోగొట్టుకోవడానికి, ఈ పూలను బాగా నూరి చర్మంమీద పట్టించడం వలన అవి తగ్గిపోతాయి.
ఈ మొక్కల వేరుతో కషాయం చేసుకుని తాగడం వలన దగ్గు నుండి విముక్తి పొందవచ్చు. చూశారు కదా ఇకనైనా మీ ఇంటి వద్ద ఈ మొక్కలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.