దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దేశంలోని మిలియన్ల కొద్దీ ప్రజలు మొదటి వేసుకున్నారు. ఇంకా ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లు వేసుకోని వారు కూడా వ్యాక్సిన్ లు వేసుకుంటున్నారు. దేశంలో డెల్టా కేసులు నమోదవుతున్న నేపద్యంలో వ్యాక్సిన్ వేసుకోవడం అనేది తప్పనిసరిగా మారింది. వ్యాక్సిన్ లు వేసుకోవ‌డం వల్ల వైర‌స్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే దేశంలో కరోనా వ్యాక్సిన్ ల కొరతను తీర్చేందుకు భారత్ విదేశీయ వ్యాక్సిన్లకు కూడా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విదేశీ వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్శుక్ మందవీయ ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు. దేశంలో మరో వ్యాక్సిన్ కు అనుమ‌తులు ఇచ్చిన‌ట్టు ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు మన దేశంలో అత్యవసర అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తో ఇప్పటి వరకు దేశంలో మొత్తం అయిదు ర‌కాల వ్యాక్సిన్ లు ఇచ్చేందుకు గానూ ఆమోదం తెలిపామ‌ని మ‌న్శుక్ మంద‌వీయ‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ కరోనాతో పోరాడేందుకు స‌హాయ‌ప‌డుతుంద‌ని వ్యాక్సిన్ ల‌ కొరత కూడా దేశంలో తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే మన దేశంలో ఇప్పటివరకు నాలుగు రకాల వ్యాక్సిన్ ల‌కు అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే...వాటిలో ఆక్స్ ఫర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన ఆస్ట్రాజ‌నికా వ్యాక్సిన్, భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్, రష్యా దేశంలో తయారుచేసిన స్పుత్నిక్ వి  అంతే కాకుండా అమెరికాలో తయారు చేసిన మొడర్ మా వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు దేశంలో 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల‌ను వేసినట్టు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 49. 55 లక్షల కరోనా వ్యాక్సిన్లు వేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికి కూడా దేశంలో కరోనా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: