ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో గుండెజబ్బులు, ఒబేసిటీ, కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఉప్పు ఎక్కువగా తింటే మెదడులో మంట, నొప్పి, దురదల వంటివి వస్తాయి.ఉప్పు గురించి శాస్త్ర వేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాలలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఉప్పు ఎక్కువ తిన్న ఎలుకలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినట్లు తెలిసింది. అదే ఉప్పు సరిపడా తిన్న ఎలుకలు మాత్రం సాధారణంగా ఉన్నట్టుగానే పరిశోధనలో తేలింది. ఈ కాలంలో చాలామంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం షుగర్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు.
ఒకవిధంగా చెప్పాలంటే షుగర్ ఎక్కువ తీసుకుంటే ఎంత ప్రమాదమో ఉప్పు కూడా అంతే అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఉప్పు వాడకాన్ని కంట్రోల్ చెయ్యాలని డబ్ల్యూ హెచ్ వోనే ప్రకటన చేసింది. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన ఎన్ని సమస్యలు ఉన్నాయోఉప్పు వలన అన్నే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఎప్పుడయినా గాని కుక్క కరిచిన వెంటనే అక్కడ ఉప్పు నీటితో కడగటం వలన ఇన్ఫెక్షన్లు తొందరగా రావు. ఏది ఎలా ఉన్నగాని ఉప్పు వాడకాన్ని తగ్గించుకుంటే బెటర్..