కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంత గడగడలాడించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మనదేశంలోనూ తీవ్ర ప్రభావం చూపింది. అయితే కరోనా ఇప్పటికే దేశాన్ని వదిలి వెళ్లదని డబ్ల్యూహెచ్ఓ కూడా స్పష్టం చేసింది. ఇండియాలో కరోనా ఇప్పుడే అంతం కాదని వెల్లడించింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్, పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రజలకు అందిస్తున్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంస్థలు తయారు చేశాయి. కాగా దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన మొదట్లో రెండు డోసుల మధ్య వ్యవధి 6 నుంచి 8 వారాలు ఉండేది. ఆ తర్వాత ఆ వ్యవధిని 12 నుంచి 16 వారాలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. డోసుల మధ్య వ్యవధి పెరిగితే మంచి ఫలితాలు వస్తాయని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (NTAGI) నిపుణులు వెల్లడించారు.

వారి సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కోవి షీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచింది. తాజాగా కోవి షీల్డ్ 2 డోసుల మధ్య వ్యవధిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంపై నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆప్ ఇమ్యూనైజేషన్ కమిటీ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించడంపై చర్చించనుంది.
కమిటీ నిపుణులు దీనిపై అనుకూలమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే మాత్రం డోసుల మధ్య వ్యవధి తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి మీలో ఎవరైనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి దోస్ వేయించుకున్న వారు ఉన్నట్లయితే తర్వాతి డోస్ ఎన్ని రోజులకు చేయించుకోవాలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే 2 వ డోస్ .