చాలా మంది వారి జీవితంలో వారి జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీనివల్ల  వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. నిద్ర కూడా కరువవుతుంది. ఇలా నిద్ర లేకపోవడం వలన మనిషికి పనిపై ఏకాగ్రత లోపిస్తుంది. అయితే దీనికి మనం పరిష్కార మార్గం ఏంటో తెలుసుకుందామా.. ఈ ముహూర్తంలో నిద్ర లేస్తే  మన జీవితంలో అన్నీ బాగుంటాయి. అది ముహూర్తమో తెలుసుకుందామా..? ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులతో మొదలవుతుంది. ఇలా చేస్తున్న క్రమంలోనే కరోనా వైరస్ వచ్చి ఈ ఉన్న కాస్త జీవితాలు తలకిందులు అయిపోయాయి. ఎంతో మంది ఉద్యోగాలు పోయి  రోడ్డున పడ్డారు. మానసికంగా కుంగిపోయారు. కనీసం భయంతో నిద్ర కూడా పట్టని రోజులను గడిపారు. వీటన్నిటికీ ప్రధాన కారణం మధ్యతరగతి చాలీచాలని జీతాలు.

దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఇదంతా పోవాలంటే హాయిగా నిద్ర పట్టాలంటే, ఈ పద్ధతులు పాటిస్తే బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరూ ఇందులో చెప్పేది ఏమిటంటే మనం పొద్దున్నే లేచినప్పుడు సూర్యోదయం కంటే ముందు లేవాలి. అప్పుడే మన పనులు తొందరగా ముగించుకో డానికి వీలుగా ఉంటుంది. సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేవడం వలన అదృష్టం వరిస్తుందని మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా మన దగ్గరికి వస్తాయని అంటారు. చాలామంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే బాగుంటుందని అంటూ ఉంటారు.

బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు వస్తుంది..?
 ప్రతిరోజు  తెల్లవారుజామునే  3.30 గంటల నుంచి 5.30 నిమిషాల లోపే నిద్రలేస్తే దానిని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇలా ఈ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల  మనకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుందట. దీంతో పాజిటివ్ ఆలోచనలు రావడం వల్ల అందరితో కలిసిపోయి ఆనందంగా ఉంది శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని  అంటున్నారు. మన పూర్వీకులు  ఎక్కువగా ఐదు గంటలకు నిద్రలేచి చన్నీటి స్నానం చేసి సూర్యనమస్కారాలు చేసేవారు. అందువల్ల వారు ఎక్కువ కాలం జీవించి ఆరోగ్యంగా ఉండేవారు. కాబట్టి మీరు కూడా ఇప్పటినుంచి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడానికి ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: