అయితే ఇలా డయాలసిస్ చికిత్స కోసం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల కోసం ఇటీవలే భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ పౌండేషన్ ట్రస్ట్ ఒక గొప్ప ఆలోచన చేసింది. పేద ప్రజలందరికీ అండగా నిలబడేందుకు సిద్ధమైంది. ఎంతో మందికి తక్కువ ఖర్చుతోనే డయాలసిస్ చికిత్స అందించి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడానికి సిద్ధమైంది భగవాన్ మహావీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్. డయాలసిస్ చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టలేక బలవంతంగా భారాన్ని మోస్తున్న పేద ప్రజలందరికీ ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి.
వేల రూపాయలు ఖర్చు అయ్యే డయాలసిస్ చికిత్సను కేవలం 300 రూపాయలకి అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది ఈ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఇటీవలే కింగ్ కోటి ఆస్పత్రిలోనే సెంటర్లో ప్రస్తుత సభ్యులతో కలిసి ఆ ట్రస్టు చైర్మన్ పీసీ సిరాక్ మీడియాతో మాట్లాడారు. కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 24 డయాలసిస్ యంత్రాలతో కొత్త కేంద్రాన్ని ప్రారంభించాము అంటూ ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలు డయాలసిస్ లు పూర్తి చేసిన సందర్భంగా ఈనెల 13వ తేదీన సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తమ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పేద ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.