ఎంతో పోషక విలువలతో కూడిన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటూ చెబుతూ ఉంటారు నిపుణులు. అయితే నేటి రోజుల్లో బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా ఎవరూ అంతగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ను స్ట్రీట్ ఫుడ్ గా మార్చేశారు. రోడ్డుపై ఎలాంటి టిఫిన్ దొరికితే అది తినేసి సర్దుకోవడం లాంటివి చేస్తున్నారు అందరు. అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఎంతో మంచిదని రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడమే కాదు అటు ఆరోగ్యాన్ని కూడా పదిలంగా ఉంచుకో వచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
బ్రేక్ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటూ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో శనగలు విరివిగా తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఒక కప్పు శనిగలు తింటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది అని అంటున్నారు. అంతే కాదు బ్లడ్ ప్రెజర్ ను అదుపు చేసే శక్తి కూడా శనగలకు ఉంటుందని.. ఇలా ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ లో శనగలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. అంతేకాదు శనగలలో ఉండే ఫైబర్ డైజెస్టివ్ సిస్టం ను ఎంతో మెరుగు పరిచి మలబద్ధకం అజీర్తి సమస్యలను కూడా దూరం చేస్తుంది అన్న విషయాన్ని చెబుతున్నారు. అంతేకాకుండా హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందట.