
* మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉండేలా చేసి రోగాలను నియంత్రించడం లో చక్కగా ఉపయోగపడతాయి.
*అంతే కాకుండా త్వరగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారికి మునగాకు ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. రోజు పరగడుపున ఒక గ్లాసుడు పచ్చి మునగాకు జ్యూస్ ను కనుక తాగితే సరి... మీ శరీర బరువు తగ్గడమే కాదు, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కూడా కరిగించి మీ బెల్లిని తగ్గిస్తుంది.
*మునగాకు జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వలన శరీరానికి సరిపడా ప్రోటీన్లు, కాల్షియం పూర్తిగా లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ మీ కళ్ళను సంరక్షిస్తుంది. నిద్రలేమి వలన చాలామంది బాధపడుతుంటారు. కొందరికైతే నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు అలాంటి వారు కనుక రోజు మునగాకు జ్యూస్ ను తాగితే నిద్రలేమికి గుడ్ బై చెప్పొచ్చు.. అంతేకాకుండా ఇది రక్తహీనతకు గొప్ప ఔషధం కూడా, ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వలన రక్తహీనత సమస్య నుండి దూరం చేస్తుంది. మునగాకులో ఉండే పోషకాలు మీ కురులు బలంగా వత్తుగా పెరగడానికి కూడా సహాయపడతాయి