ప్రపంచాన్ని ప్రస్తుతం ఒణికిస్తున్నది, ప్రజలను భయాందోళనలకు గురు చేస్తున్నది ఏదయినా ఉందంటే అది ఖచ్చితంగా కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ మాత్రమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. భారతీ యలు తాజాగా గర్వించ తగ్గ విషయం ఏమిటంటే ప్రస్తుతం ఓమిక్రాన్ టీకా భారత్ లో తయారు కానుంది. ఎప్పుడో తెలుసా ?
భారతదేశానికి చెందిన జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఓమిక్రాన్-నిర్దిష్ట ఎంఆర్ ఎన్ ఏ కోవిడ్-19 వ్యాక్సిన్ రూపకల్పన పై పనిచేస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ టీకా రూపకల్పనపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి సోమవారం రాత్రి తమకు తెలిపినట్లు ఆ వార్తా సంస్థ పేర్కోంది.
"వ్యాక్సిన్ యొక్క ఓమిక్రాన్-నిర్దిష్ట వేరియంట్ అభివృద్ధిలో ఉంది. అంతేకాకుండా నియంత్రణ ఆమోదాలకు లోబడి మానవ క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంటుంది" అని కంపెనీ ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థకు వచన సందేశం అదేనండీ టెక్ట్స్ మెసేజ్ రూపంలో తెలిపారు.
. "మేము మీకు ఏవిషయం తెలియచేస్తాం." సమాచారం ప్రైవేట్‌గా ఉన్నందున పేరు పెట్టడానికి ఇష్టపడని మూలం, ఉత్పత్తిని విడుదల చేయడానికి ముందు భారతదేశంలో చిన్న ట్రయల్ అవసరమవుతుందని కూడా ఆయన తెలిపినట్లు వార్తా సంస్థ కథనం.
గత వారం ఫైజర్ సంస్థ కూడా కోవిడ్-19 తాజా వేరియంట్ ఓమిక్రాన్ కోసం ప్రత్యేకంగా టీకా మందుకు తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నాటికి ఈ టీకా సిద్ధమవుతుందని కూడా ఆ సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వం కనుక అత్యవసర వినియోగం నిమిత్తం ఈ టీకాలను అనుమతిస్తే భారత్ లోనే ఓమిక్రాన్ టీకా తయారైనట్లువుతుందని ఆ వార్తా సంస్థ పేర్కోంది.భారత్ లో ఇప్పటికే చాలా సంస్థలు కోవిడ్-19 లో వస్తున్న వేరియంట్ల పై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ప్రాథమిక దశల్లోనే ఉన్నాయి. పైన పేర్కోన్న సంస్థలు మాత్రం వైద్య పరిశోధనల్లో కాస్త ముందున్నాయి. ఏది ఏమైనా భారత్ లో జరుగుతున్న పరిశోధనలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవడం సంతోషించ తగ్గ పరిణామం