మరికొద్ది రోజుల్లో వేసవికాలం రాబోతోంది.. ఈ నేపథ్యంలో ఎటువంటి కూరగాయలు తీసుకుంటే ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.. అనేది ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

మాటోలు:
టమోటా లో 95 శాతం నీరు సమృద్ధిగా మనకు లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ బి9 , విటమిన్ K 1 వంటివి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఈ టమోటాలలో ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది.. కాబట్టి మనకు జీర్ణక్రియ రేటును పెంచుతుంది. ముఖ్యంగా టమోటాల వల్ల ఎండా కాలంలో వేడి తాపాన్ని తగ్గించుకోవచ్చు.

వంకాయలు:
వంకాయలు వేడి చేస్తాయని.. వైద్యులు సైతం చెబుతున్న విషయమే కానీ ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్, ఫైబర్ వంటివి పుష్కలంగా లభించడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారిస్తుంది. ఇక అంతే కాదు మంచి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. ఇక వేడి వల్ల కలిగే మలబద్దకం సమస్యలు, జీర్ణ సమస్యలు వంటివి దూరం చేయడానికి వంకాయలు చాలా బాగా పనిచేస్తాయి.

కాకరకాయ:
ఎండాకాలం మొదలైంది అంటే చర్మంపైన సోరియాసిస్, పొక్కులు వంటివి వస్తాయి.. కానీ కాకర కాయ తినడం వల్ల ఈ సమస్యలను మనం దూరం చేసుకోవడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా  పెంపొందించుకోవచ్చు.

క్యారెట్:
సంవత్సరం పొడవునా మనకు అందుబాటులో వుండే క్యారెట్లో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరం కూడా చల్లబడుతుంది.

ఉసిరి:
మంచి ఆరోగ్యాన్ని కలిగించే ఉసిరి వల్ల మనకు విటమిన్ సి , మినరల్స్,  ఫైబర్ వంటివి లభిస్తాయి.. ఇక శక్తిని బలపరచడానికి కూడా ఉసిరి కాయలు బాగా పనిచేస్తాయి.

దోస కాయలు:
నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఈ దోసకాయలు కాపాడతాయి. వేసవిలో చక్కటి ఆరోగ్యాన్ని అందించే గొప్ప వెజిటేబుల్ అని చెప్పవచ్చు.

కాబట్టి వేసవి కాలంలో ఈ కూరగాయలు ఎప్పుడు మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: