మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగితేనే శరీరంలోకి వైరస్లు , బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి ప్రవేశించకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన కరోనా వైరస్ నుంచి కూడా మనం మనల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కరోనా మూడు దశలుగా రూపాంతరం చెంది ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎవరైతే రోగనిరోధక శక్తిని తక్కువగా కలిగి ఉన్నారో అలాంటి వారు ఏకంగా ప్రాణాలను కూడా కోల్పోయారు. కరోనా మళ్లీ నాలుగవ దశలో మరింత భయంకరంగా విజృంభించ డానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పలు దేశాలలో కరోనా నాలుగవ దశ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న విషయం మనకు తెలిసిందే.


మనల్ని ఈ వైరస్ ఏమి చేయకుండా ఉండాలి అంటే అందుకు తగ్గట్టుగా మన శరీరంలో ఇమ్యూనిటీపవర్ కూడా పెరగాలి. అలా ఇమ్యూనిటీపవర్ పెరగాలి అంటే ఏం చేయాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలి. మాంసం, పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ , తాజాపండ్లు, ఆకుకూరలు వంటివి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ కారణంగా మనలో ఇమ్యూనిటీపవర్ పెరుగుతుంది. ఆకుకూరలు, దుంపలు వంటివి ఎక్కువగా ఉడికించకూడదు. వీలైనంతవరకు పచ్చిగా తినడం వల్ల వాటిలో ఉండే  మినరల్స్,  విటమిన్స్ లభించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.

వీలైనంత వరకు ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి ఇక ప్రతిరోజు గుప్పెడు డ్రైఫ్రూట్స్ తో పాటు మొలకెత్తిన గింజలను కూడా తినాలి. అలాగే రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల శరీరం ఉత్తేజపరిచి.. మెదడు కూడా చాలా చురుకుగా పని చేస్తోంది. అంతేకాదు ప్రతి రోజు సూర్యరశ్మిలో ఉంటూనే సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభించి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి రోజు వాకింగ్ చేయడం , యోగా చేయడం వల్ల మానసికంగా,  శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: