
1).పెరుగును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు కాని కొవ్వు లేని పెరుగు మాత్రం మహిళలు తినకూడదు. మార్కెట్లో దొరికే నాన్ ఫ్యాట్ పెరుగులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇలా వీటిని తినడం వల్ల 80 శాతం వరకు ప్రమాదం ఉంటుందట.
2). వైట్ బ్రెడ్ శుద్ధిచేసిన కార్బ్ మన శరీరానికి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెరను పెంచేస్తాయి. ఎందుకంటే ఇలాంటి పిండిపదార్ధాలలో ఫైబర్ అసలు ఉండదు కనుక. Pcos తో బాధపడుతున్న మహిళలు ఇలాంటివి అస్సలు తినకూడదు.
3). డైట్ సోడాలో తక్కువ కేలరీలు ఉంటాయి కానీ ఇందులో రసాయనాలు, సంరక్షకారులు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని అమెరికన్ జెరియాట్రిక్స్ పరిశోధనలో తెలియజేయడం జరిగింది. కేవలం ఇలాంటి డైట్ సోడా తాగే వ్యక్తులలో తొమ్మిది ఏళ్ళు కాలంలోనే వారి కంటే మూడు రెట్లు అధికంగా కొవ్వు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.
4). మార్కెట్లో లభించే కాఫీ పై తెల్లని క్రీమ్ చూసే ఉంటారు. ఇది రుచిని పెంచడానికి తయారుచేస్తారు. అయితే ఈ కాఫీ క్రీమును ట్రాన్స్ ఫ్యాట్ ద్వారా తయారు చేస్తారు. దీనిలో హైడ్రోజన్ ఆయిల్ ను కూడా కలపడం జరుగుతుందట. దీంతో గుండెకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.