ఇక మనం ఈ లోకాన్ని చక్కగా చూడాలంటే మనకు మంచి కళ్ళు అనేవి అవసరం.మన పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు అందుకే. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న వేళ కంప్యూటర్ల వాడకం చాలా బాగా పెరిగిపోయింది.ఇక రోజుకి 7 నుంచి 8 గంటల పాటు మనం డెస్క్ టాప్, ట్యాబ్ ల ముందు ఖచ్చితంగా కూర్చుంటాం. అంతకంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తుంటాం. అయితే, ఎక్కడ పనిచేస్తున్నా కూడా కంటిని సంరక్షించుకోవడం అత్యవసరం.ఇక కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి. అదే పనిగా తెరను చూడటం వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు కారణమైన కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి ఇక మనకు నిద్ర రావటానికి మెలటోనిన్ హార్మోన్ తోడ్పడుతుంది.ఈ నీలి కాంతి ఈ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. అందుకే పడుకునే ముందు కంప్యూటర్ స్క్రీన్ తదేకంగా చూస్తుంటే నిద్ర బాగా దెబ్బ తింటుంది. కంప్యూటర్ స్క్రీన్ కాంతిని తగ్గించుకోవాలి.ఇక డెస్క్ టాప్ మీద 'స్టార్ట్' బటన్‌తో సెటింగ్‌లోకి వెళ్లాలి. తరువాత అక్కడి నుంచి 'సిస్టమ్' ఆప్షన్ను క్లిక్ చేస్తే 'డిస్ ప్లే' విభాగం కనిపిస్తుంది.



ఇక్కడే 'కలర్' ఫీచర్ కింద 'నైట్ లైట్' అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేస్తే నీలికాంతి అనేది ఆగిపోతుంది.ఇక దీని ద్వారా కాంతిని పెంచుకోవటం ఇంకా తగ్గించుకోవటము చేసుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ఎప్పు డు నైట్ లైట్ మోడ్లోకి మారాలో కూడా ముందే మీరు నిర్ణయించుకోవచ్చు.అలాగే సిస్టమ్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌, రేడియేషన్‌ వల్ల చర్మ సమస్యలు తెస్తుంది. బ్లూలైట్‌ నుంచి స్కిన్‌ను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.అలాగే ఇంట్లో ఉన్నా కూడా సిస్టమ్‌ ముందు పనిచేసేటప్పుడు యూవీ ప్రొటక్షన్‌ క్రీమ్‌ ని పెట్టుకోవాలి. లేదా ఎస్‌పీఎఫ్‌ ఉన్న మాయిశ్చరైజర్స్ ఖచ్చితంగా రాసుకోవాలి.అలాగే పని చేసేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకోవాలి.ఇంకా దాంతోపాటు రెగ్యులర్‌గా ఫేస్‌వాష్‌ చేసుకోవాలి. కళ్ళను మూసి కంటి పైభాగాన్ని కూడా బాగా శుభ్రంగా కడుగుకోవాలి.అలాగే మీరు కూర్చునే సీటు నుంచి కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కనీసం 18 ఇంచుల దూరంలో ఖచ్చితంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: