
ఈ క్రమంలోనే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం లేవగానే వ్యాయామం చేయడం ఎంతో మంచిది... ఉదయం లేవగానే ఒక్కసారిగా ఎక్కువ బరువులు ఎత్తటం మాత్రం అది ఆరోగ్యానికి ప్రమాదం అనిహెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే రాత్రంతా నిద్ర పోయిన సమయం లో శరీరంలో పెద్దగా కదలికలు ఉండవు. ఈ క్రమంలోనే ఉదయం లేచే సమయానికి కండరాలు మొత్తం బిగుసుకుపోయి ఉంటాయి. ఇలాంటి సమయంలో కొంతమంది ఉదయం లేవగానే ఎలాంటి వార్మప్ చేయకుండా నేరుగా ఎక్కువ బరువు ఎత్తుతూ ఉంటారు.
లేదా కఠినతరమైన వ్యాయామాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం కండరాల ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయాలి అనుకునేవారు తప్పనిసరిగా కొన్ని నిమిషాలపాటు వార్మప్ చేయడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. లేదా యోగా లాంటిది చేయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. బిగుసుకుపోయి ఉన్న కండరాలు ఫ్రీ అవుతాయని అప్పుడు బరువు ఎక్కువగా ఎత్తిన పెద్దగా కండరాలపై ఒత్తిడి పడదని అంటూ చెప్పు సూచిస్తున్నారు నిపుణులు..