చికెన్.. ఈ పేరు చెబితే చాలు అందరికీ నోరూరిపోతుంది. ఎందుకంటే గుమగుమలాడే చికెన్ కర్రీ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇటీవలి కాలంలో ఎంతోమంది ముక్క లేనిదే ముద్ద దిగదు అనే రేంజ్ లో తరచు నాన్ వెజ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అటు మార్కెట్లో మాంసానికి డిమాండ్ కూడా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా అటు కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు ఇలా చెప్పారో లేదో అటు జనాలు కావలసిన దానికంటే కాస్త ఎక్కువగానే తినడం మొదలు పెట్టేశారు అనే చెప్పాలి.



 అది సరే గానీ ఇక ఇప్పుడు చికెన్ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.. ఇన్నాళ్ళ వరకు చికెన్ షాప్ నుంచి తెచ్చుకోవడం ఇక ఇంట్లో ఎంతో బాగా శుభ్రం చేసుకోవడం.. ఇక ఆ తర్వాత మనం కావాల్సినట్టుగా వండుకోవడం లాంటివి చేస్తూ వచ్చాము. ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు ఇలాగే చేశారు. కానీ ఇటీవల చికెన్ విషయంలో శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. సాధారణంగా షాప్ నుంచి తీసుకు వచ్చిన చికెన్  బాగా శుభ్రం చేసి వండుకుంటే మంచిది అని అందరం అనుకుంటాము అన్న విషయం తెలిసిందే.


 కానీ చికెన్ కడిగి వండితే మాత్రం డేంజర్ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. షాపు నుంచి చికెన్ తీసుకురాగానే శుభ్రం చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతుండడం గమనార్హం. చికెన్ పై క్యాంపిలో బ్యాక్టర్ అనే ఒక ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుందట. ఇక చికెన్ను ట్యాప్ కింద కడుగుతున్నప్పుడు నీళ్లు చిల్లి చేతులు బట్టల మీద పడి బాక్టీరియా సోకుతుందట. ఇక దీని వల్ల డయేరియా జ్వరం నాడీ సమస్యలు లాంటివి కూడా వస్తాయట.  అందుకే షాప్ నుంచి తెచ్చిన చికెన్ను ఇక నీళ్లలో కడగకుండా హై టెంపరేచర్ మధ్య ఉడికిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు..

మరింత సమాచారం తెలుసుకోండి: