కొంతమంది మాత్రం అన్నం తినడానికి ఇష్టపడకుండా వీటినే తింటూ ఉంటారట. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం అటుకులు తినడమే మంచిది అని తెలియజేశారు. అందుచేతనే రైస్ బదులుగా పోషకాహార మైన ఇలాంటి అటుకులు తినడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటి వల్ల పొందగలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1). అటుకుల లో గొప్ప లక్షణం ఏమిటంటే.. అటుకులు కిన్వ ప్రక్రియ ద్వారా తయారు చేయబడతాయి. ఇందులో గ్లూకోజ్ కాని కొవ్వు పదార్థాలు గానీ అస్సలు ఉండవు కేవలం పిండి పదార్థాలు విటమిన్లు, ప్రొటీన్లు మాత్రమే అధికంగా ఉంటాయి.
2). ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతూ ఉంటుంది.
3). అటుకుల లో ఇనుము చాలా అధికంగా ఉంటుంది అందుచేతనే గర్భిణీ స్త్రీలు వీటిని ఎక్కువగా తినమని వైద్యుల సలహా ఇస్తూ ఉంటారు. అటుకుల నిమ్మరసాన్ని జతచేసి తినడం వల్ల విటమిన్ సి కూడా లభిస్తుంది.
4). శరీరంలో ఉండే రక్తంలో చక్కెర స్థాయిని ఇవి నియంత్రించడానికి బాగా సహాయపడుతాయి. డయాబెటిస్ రోగులకు ఇవి చాలా ఉపయోగకరం అని చెప్పవచ్చు.