
అంతే కాకుండా ఇప్పుడు చాలా మంది దంపతులను వేధిస్తున్న సమస్యలల్లో సంతాన లేమి సమస్య ఒకటి. కాగా మగ వారిలో వచ్చే శృంగార సమస్యలను తగ్గించడంలో యాలకులు ఎంతగానో ముఖ్య పాత్ర వహిస్తాయి. అంతేకాదు ప్రతి రోజూ రెండు యాలకులను తీసుకోవడం వల్ల మగ వారిలో వీర్య కణాల సంఖ్య పెరగడమే కాకుండా, శృంగారంలో కూడా ఎక్కువ సమయం పాల్గొనే శక్తి వస్తుందట. అంతే కాదు మగవారిలో నపుంసకత్వం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాలకులను తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చని వారు తెలియజేసారు.
అయితే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక యాలక్కాయను తినడం వల్ల శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని మలినాలను తొలగించడంలో కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల లేదా వాసనను చూడడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే యాలకుల గింజలను నోట్లో వేసుకుని చప్పరించడం వలన ఆకలి పెరుగుతుంది. ఇంకా నోట్లో ఇన్ ఫెక్షన్ లు, అలాగే నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా యాలకులు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.