ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది చుండ్రు సమస్య అన్న విషయం తెలిసిందే. చుండ్రు సమస్య కారణంగా అటు తలపై ఉన్న వెంట్రుకలు బలహీనపడి రాలిపోతు ఉండటం లాంటి సమస్యలతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చుండ్రు సమస్యలకు చెక్ పెట్టేందుకు అటు ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి నిరాశ చెందుతూ వుంటారు చాలామంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యం పెరిగిపోవడం.. అంతే కాకుండా అధునాతన  జీవన శైలి నేపథ్యంలో వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ చుండ్రు సమస్య మాత్రం వేధిస్తూనే ఉంది.



 ఈ క్రమంలోనే ఇక చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు ఎంతోమంది భారీగానే డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. డబ్బు ఖర్చు అయితే పర్వాలేదు కానీ  చుండ్రు సమస్య మాత్రం తగ్గి పోతే అదే పదివేలు  అని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. కానీ డాక్టర్లను సంప్రదించి ఎన్ని మందులు వాడినా సమస్య మాత్రం తగ్గకపోవడంతో నిరాశ చెందుతుంటారు. ఇలాంటివారు వంటింటి చిట్కాలను పాటిస్తే ఇక ఉపశమనం లభించే అవకాశం ఉంటుందని కొంతమంది వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 చుండ్రు సమస్యను దూరం చేసుకోవడానికి వందల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల షాంపూలు వాడటం కి బదులు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చిన్న చిట్కాతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వేపాకుతో చుండ్రు సమస్యను తగ్గించవచ్చు. అయితే డాండ్రఫ్ కి కారణమయ్యే ఫంగస్ ను ఔషధ గుణం ఉన్న వేపాకు అరికడుతుందని అంటున్నారు నిపుణులు. 2 పిడికిల వేపాకు వేడి నీటిలో రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం లేవగానే ఇలా వేపాకు నానబెట్టిన నీటితో తల శుభ్రంగా కడగాలి. మిగిలిన వేపాకును పేస్టులా చేసి మాడుకు పట్టించాలి. గంటసేపు ఆగిన తర్వాత స్నానం చేస్తే చుండ్రుసమస్యల నుంచి పైసా ఖర్చులేకుండా ఉపశమనం లభిస్తుందని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: