![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/health/movies_news/health321772fc-6272-444c-8bfd-59168d4961ab-415x250.jpg)
మెంతి కూర లో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అయితే మెంతి కూరను ఎక్కువగా తినరు. మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే ఇది కొంచం చేదుగా ఉంటుంది. కాబట్టి దీన్ని పెద్దగా వంటలకు వాడరు. అయితే మెంతి కూర వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ముఖ్యంగా ఇది కీళ్ల నొప్పులకి గొప్ప ఔషధంగా పని చేస్తుం ది.
ఉడక బెట్టిన మెంతికూర ఆకులు తినడం వలన అజీర్తి సమస్య తగ్గుతుంది. కీళ్ళ నొప్పులను పూర్తిగా నయం చేస్తుంది. రక్త శాతాన్ని పెంచి రక్తహీనతను కూడా నివారిస్తాయి. శ్వాసక్రియ లోని అవరోధాలు కూడా సరిచేసి శ్వాసకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ఒక గుప్పెడు మెంతి ఆకులను కానీ పరోటాలలో, చట్నీలలో, టమాటో కూరలో వేసుకుని వండుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కనీసం వారంలో మూడు నాలుగు సార్లు అయినా మెంతి కూర తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. షుగర్ వ్యాది ఉన్న వారికి కూడా మెంతి కూర చాలా మంచిది. షుగర్ ని నియంత్రణ లో ఉంచడానికి మెంతి కూర ఉపయోగపడుతుంది.