ఇక ఊపిరితిత్తులకు ఇన్‌ఫక్షన్ వచ్చినప్పుడు అవి సరిగ్గా పనిచేవు.. అయితే ఈ లక్షణాలు కనుక కనిపిస్తే.. ఊపిరితిత్తులు డేంజర్ లో పడుతున్నట్లు లెక్క అని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు.ఇక ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమిటో  మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లు రకరకాల కారణాల వలన ఎక్కువగా వస్తాయి. ఈ లక్షణాలుంటే ఊపిరితిత్తులు చెడిపోయినట్లే..ముఖ్యంగా దగ్గు ఎక్కువగా వస్తుంటే.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని ఖచ్చితంగా అనుమానించాలి.. ఆ వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, చికిత్స తీసుకోవాలి.అలాగే ముఖ్యంగా ఛాతిలో నొప్పిగా ఉంటే.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు ఖచ్చితంగా అనుమానించాలి. ఒకొక్కసారి రెండు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అనుమానించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే తరచుగా జ్వరం వస్తుంటే.. లంగ్ ఇన్‌ఫెక్షన్ ఉండే అవకాశం చాలానే ఉంది. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, తో పాటు, ముక్కు ఇంకా నోటి నుంచి నీరు కారుతుంటే.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది..అందుకు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.అలాగే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కనుక ఎదురవుతుంటే.. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ ఏమో అని అనుమానించాల్సి ఉంటుంది.


ఇంకా అలాగే తీవ్రంగా అలసటకు గురవుతున్నా ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నా ఊపిరితిత్తులు పనితీరుపై అనుమానించాల్సి ఉంటుందని..అప్పుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది అని అంటున్నారు.ఇంకా అలాగే గురక తీవ్ర స్థాయిలో వస్తుంటే.. లంగ్స్ పనితీరుపై కూడా అనుమానించాల్సి ఉంటుందట..అలాగే దీర్ఘకాలిక కఫంతో ఇబ్బంది పడుతుంటే.. ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం కనుక కఫంతో ఇబ్బంది పడుతుంటే.. మీరు ఊపిరితిత్తుల పనితీరుపై ఆలోచించాల్సిందేనట..ఇక వీటిల్లో ఏ లక్షణాలు కనిపించినా కానీ నిర్లక్ష్యం చేయకుండా.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి..ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవాలి.తద్వారా మీరు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.ఈ లక్షణాలుంటే ఊపిరితిత్తులు చెడిపోయినట్లే!


మరింత సమాచారం తెలుసుకోండి: