
అందుకే పట్టణాలలో ఉండే వారు అలా బయటకి వెళ్లి సమోసా, బజ్జీ, బోండా, పానీ పూరి లాంటివి తింటూ ఉంటారు. అయితే ఏ టైం అయినా కూడా పానీ పూరి లకు ఉండే క్రేజ్ వేరే... అందుకే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ వర్షాకాలంలో పానీ పూరీలు తినడం చాలా ప్రమాదం అని తెలుస్తోంది. అయితే ఈ పా పూరీలు చేసే వ్యక్తి లేదా చేసే ప్రదేశం పరిశుభ్రంగా లేకపోతే లేని పోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజాగా తెలంగాణ డి ఎమ్ హెచ్ ఓ శ్రీనివాసరావు అందరికీ చెప్పిన విషయం తెలిసిందే. షాప్ వ్యక్తి పూరీలు అయితే సెపరేట్ గా చేస్తాడు. కానీ పానీ తయారుచేసే విధానం మాత్రం సరిగా ఉండదు.
అందులో కావలసిన పదార్ధాలను ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి, తన తన చేతులతోనే మిక్స్ చేస్తాడు. అందుకే పానీ మలినం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ తినడం ఇబ్బందికరం. మీరు ఒకవేళ ఈ పానీ పూరి తింటూ ఉంటే వెంటనే మానేయండి. దీని వలన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట.