మాములుగా ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వలన మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైన సమస్య అధిక బరువు. అయితే కొందరు లావుగా ఉండటమే కాదు, మరీ సన్నగా ఉండటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అవును చాలా సన్నగా ఉన్నా కూడా చూడటానికి అంత ఇంపుగా అనిపించరు. ముఖ్యంగా యువత తమ అందంపై చాలా ఆసక్తి చూపుతుంటారు. వారి శరీర ఆకృతి చక్కగా ఉండాలని ఇష్టపడతారు. అదే విధంగా ఎక్కువగా లావుగా ఉంటే సన్నగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

అలాగే మరీ సన్నగా ఉన్న వారు కూడా తమ శరీర బరువును కాస్త పెంచుకుని ఫిట్ నెస్ గా కనిపించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అదేంటో కొందరు ఎంత తిన్నా అంతే సన్నగా ఉంటారు. మరి కొందరు తమ శరీర బరువును పెంచుకోవడానికి మెడిసిన్స్ కూడా వినియోగిస్తుంటారు. కానీ చాలా మందికి ప్రయోజనం ఏమీ కనిపించదు. అయితే ఇలా కొందరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బరువు అస్సలు పెరగకపోవడానికి కారణం ఇవే అని నిపుణులు చెబుతున్నారు.

శరీర బరువును నియంత్రించే  జన్యుశాస్త్రం, పోషకాహారం మరియు ప్రవర్తనా కారకాలను కూడా కలిగి ఉంటాయని చెబుతున్నారు. ప్రతి వ్యక్తి యొక్క శరీర బరువు పలు కారకాల వలన పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది. ఎంత తింటున్నారు అన్నది కాదు, శరీరానికి అవసరమయ్యే మంచి పోషక ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సమయానికి తీసుకోవడం కూడా ముఖ్యం మరియు తగిన క్యాలరీలు తీసుకోవడం కీలకం. మరీ ఎక్కువగా శారీరకంగా శ్రమిస్తున్నా లేదా ఎక్కువ ఆందోళన చెందే విషయాల గురించి పదేపదే ఆలోచించడం, మరీ సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉండడం వంటివి కూడా ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. కాబట్టి పైన తెలిపిన విషయాలను అర్ధం చేసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: