గుండెపోటు: ఎలా గుర్తించాలి? రాకుండా ఏం చేయాలి?
గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్య భాగంలో బరువుగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. చెమటలు పడతాయి, నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే గుండె వైద్య నిపుణులు ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. చాలా మంది గుండెపోటును గ్యాస్ నొప్పిగా తీసుకుని సొంత వైద్యం లేదా స్థానికంగా ఉండే క్లినిక్‌ల్లో వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు.గుండె పోటు ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిలోనూ వస్తుంది. కొందరికి జన్యుపరంగా వస్తుంది. గుండెపోటు వచ్చిన వక్తికి అత్యవసరంగా వాడే రెండు రకాల మాత్రాలున్నాయి. అవి ASPIRIN 325 mg, Sorbitrate 5 mg.. గోల్డెన్ అవర్(మొదటి ఆరు గంటలు)లో ఆస్పత్రిలో చేరితో గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసర ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు. తర్వాత పేషేంట్ గుండెకు సంబంధించి ఈసీజీ, ఈకో, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి గుండె పరిస్థితి తెలుసుకుని సరైన వైద్యం అందించవచ్చు. కరోనా తర్వాత గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కోవిడ్ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దాంతో గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా మద్యపానం, ధూమపానం చేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, బీపీ, సుగర్, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంది. అధిక ఒత్తిడి వల్ల బీపీ పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు. ఆందోళన వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. గుండెపోటు రాకుండా ఉండాలంటే మద్యపానం, ధుమపానం మానాలి. ప్రతి రోజూ వ్యాయమం చేయాలి. పాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోరాదు. కనీసం 45 నిమిషాలు నడవాలి. రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. బీపీ, సుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉండాలి.కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించి గుండె పోటు రాకుండా చూసుకోండి.