
ఇన్స్టంట్ నూడుల్స్లో సాధారణంగా ఆయిల్ తో పాటు పిండి, నీరు, కాన్సుయి, సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్ ఉంటాయి. ఇది కాకుండా మసాలాలు, ఉప్పు, మోనోసోడియం గ్లుటామేట్ కూడా ఉంటాయి. వైద్యులు ఒక రోజులో 2 గ్రాముల సోడియంను మాత్రమే అవసరమని, అంతకు మించితే శరీరానికి హాని కలిగిస్తుందని సూచిస్తారు.అయితే 100 గ్రాముల మనం వండుకునే టేస్టీ నూడుల్స్లో 397 నుంచి 3678 MG సోడియం ఉంటుందని ఒక పరిశోదనలో తేలింది. అందువల్ల మోతాదుకు మించి సోడియం తీసుకోవడం వల్ల యూరిన్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంతే కాకుండా పిల్లలు బాగా ఇష్ట పడుతున్నారు కదా అని ఎక్కువగా పెట్టడం వల్ల, అది వాళ్ళ జీర్ణ శయం పై ప్రభావం చూపి, పేగు క్యాన్సర్ లకు దారి తీస్తుంది.
ఇన్స్టంట్ నూడిల్స్ కి టేస్ట్ రావడానికి MSG అనే మసాలా ప్యాకెట్ వాడుతుంటారు. ఆ మసాలా శరీర ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రాను రాను క్రమంగా,నరాల బలహీనత, నీరసం, నిసత్తువా, మెదడు మొద్దుభారడం,క్యాలిషియం డేపిషియ్యన్సీ,వంటి రోగాలకు దారితీసి, పిల్లల ఎదుగుదల పై ప్రభావం చూపుతుంది.
ఇందులో ఉండే అధిక సోడియం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టంట్ నూడిల్స్ ఫైబర్ కంటెంట్ ఉండదు,కాబట్టి తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవదు. దీనివల్ల వేరే ఆహారం తినే ఆలోచన తొందరగా కలగదు. అందువల్ల చిన్న వయసులోనే ఊభకాయం,షుగర్ వంటి దీర్ఘ కాలిక రోగాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు.అంతే కాక ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా పిల్లలకి పెట్టడం వల్ల వారికి సాంప్రదాయ వంటలపై మక్కువ తగ్గిపోతూ ఉంటుంది. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వారి శరీరానికి అందవు.
Nudules,Childrens