ఈ సమస్యలుంటే పసుపు అస్సలు వాడవద్దు ?
పసుపును భారతీయులు ఎక్కువగా వంటల్లో వాడతారు. ఇంకా అలాగే దెబ్బలకు మందుగా కూడా వాడతారు. పసుపు వంటకాల రుచిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా చాలా ఈజీగా దూరం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.పసుపులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి దీనిని క్రమంగా వినియోగిస్తే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా సీజనల్ వ్యాధులు సులభంగా నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పసుపును తీసుకోకపోవడం చాలా మంచిది. చాలామందికి శరీర భాగాల్లోంచి రక్తస్రావం జరుగుతుంది. అయితే ఇలాంటి వారు కూడా పసుపును తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే మూలకాలు శరీరంలో వేడి తీవ్రతను పెంచి వివిధ రకాల సమస్యలకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు పసుపుతో తయారు చేసిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల నొప్పులు అధికంగా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి పసుపును అతిగా వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పచ్చకామర్ల సమస్యతో బాధపడుతున్న వారు వీలైనంతవరకు పసుపుతో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఒకవేళ వీటిని తీసుకుంటే తప్పకుండా వైద్యుని సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.మధుమేహంతో బాధపడుతున్న వారు వివిధ రకాల ఔషధాలను వినియోగిస్తారు. ఈ ఔషధాలను వినియోగించే క్రమంలో పసుపుతో తయారు చేసిన టీలను కానీ ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మధుమేహం తీవ్ర సమస్యగా మారే అవకాశాలు వున్నాయి. కాబట్టి ఈ సమస్యలు వున్నవారు పసుపుని అస్సలు వాడవద్దు.